CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 125

ప్రభువా నీ గొప్పతనము స్తుతికి యోగ్యము

prabhuvaa nee goppatanamu stutiki yogyamu

Psalms 145:3

More
Reference recording on YouTube ↗
పల్లవి : ప్రభువా నీ గొప్పతనము - స్తుతికి యోగ్యముఅశక్యమైనది - వర్ణించలేమిల1. సృష్టి గొప్పది అద్భుతమేగా - సంకల్పమెంతో వుత్తమముమానవజాతి కొరకై ప్రభూ - సిద్దపరచె సమస్తమునీదు పనులు నీ సామర్ధ్యము వర్ణించలేమిల|| ప్రభువా ||
2. నీ రూపమున నరుని సృజించి - అధికారము నిచ్చితివిక్రీస్తునందు నిర్దోషినిగా - నిలువబెట్ట గోరితివినీదు దయ నీ మంచితనము వర్ణించలేమిల|| ప్రభువా ||
3. సృష్టిని చేసిన శక్తికంటె - పాపికి రక్షణ గొప్పదినీ యొద్ద నున్న సర్వమిచ్చి - విలువగు ముత్యము కొన్నావునీ ఐశ్వర్యము నీ మహిమను వర్ణించలేమిల|| ప్రభువా ||
4. నీకు మానవుడమూల్యము - నీవు ప్రేమించుచున్నావుఅందుకే నీ ప్రాణమర్పించి - రక్తము కార్చి రక్షించితివినీ అద్భుత ప్రేమ నీ కృప వర్ణించలేమిల|| ప్రభువా ||
5. అద్భుతమైన నూతన సృష్టి - మానవునికి నిచ్చితివిరాజులనుగ యాజకులుగ వారసులుగను చేసితివినీ రాజ్యము నీ ప్రభావము వర్ణించలేమిల|| ప్రభువా ||
6. ఉల్లాసముతో సృష్టి మైమరచే - అద్భుత కార్యములను చూచిసంతోషించి ఆరాధించిరి - నీవే సర్వమని చెప్పిరినీ ప్రభుత్వము నీదు సత్యము వర్ణించలేమిల|| ప్రభువా ||

Back to Hebron Seeyonu Geethalu