పల్లవి:స్తుతులకు పాత్రుండవు (2) - సృష్టించినావు రక్షించినావు భద్రపరచుచున్నావు (2)
1. జీవపు రొట్టె వైతివి నీవే - తృప్తిపరచిన ప్రియుడవు నీవే (2) గొప్ప కార్యము చేయ (2)- మా సామర్ధ్యము నీవే ..ఆ ...ఆ ..ఆ (2)
2. లోకమునకు వెలుగు నీవేగా - మా నేత్రముల తెరచితివిగా అద్భుతము చేసితివి - మా ప్రకాశము నీవే
3. ఏకైక ద్వారం మాకిల నీవే - ప్రవేశమిచ్చి రక్షించినావు పూర్ణ క్రియ చేసితివి - సంపూర్ణ శాంతి నీవే
4. మంచికాపరి మాకై నీవిల - ప్రాణంబు నిచ్చి రక్షించితివి విడుదల చేసితివి - గొఱ్ఱెల నడిపెదవు
5. పునరుత్థాన జీవంబు నీవే - మరణము నుండి దాటించితివి విజయంబు నిచ్చితివి - నూతన పరచితివి
6. మార్గ సత్యము మాకిల నీవే - దుర్బోధ నుండి కాపాడినావు చేసితివి ఆత్మకార్యం - ఉన్నత స్థలమందుంచి
7. నిజమైన ద్రాక్షవల్లివి నీవే - నీ యందు నిలిచే తీగెలు మేము లోతైన క్రియ చేసి - ఆత్మ ఫలమిచ్చితివి