పల్లవి:మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్యనివాసి (2)మా సామర్థ్యము పునరుత్థానము మా జీవము మా రక్షణనిధి (2)
1. ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు (2) అయినను - నలిగిన వినయంపు దీనమనస్సులో నివసించును జీవించును (2)
2. దినమెల్ల ప్రభుకై వధియింపబడి యున్నట్టి గొఱ్ఱెలము అయినను - ప్రేమించినవాని ప్రేమను బట్టియే పొందితిమి విజయమును
3. మోసము, శిక్షయు, దుఃఖమును, దరిద్రత కలిగియున్నాము అయినను - సత్యము, జీవము, సంతోషమును ఐశ్వర్యముల్ పొందితిమి
4. పడిపోయి మేముంటిమి అంధకారమందుంటిమిగా అయినను - తిరిగి లేతుము యెహోవాయే మా వెలుగు మా రక్షణ
5. మన క్రీస్తును బట్టి యెల్లప్పుడు నిందకు పాత్రులమైతిమి అయినను - ఎల్లప్పుడు వూరేగించును మమ్ము విజయముతో స్తోత్రములు