CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 150

నమస్కరింప రండి - దావీదు పుత్రుని

namaskarimpa randi - daaveedu putruni

Psalms 95:7

More
Reference recording on YouTube ↗
1. నమస్కరింప రండి - దావీదు పుత్రుని శ్రీ యేసు రక్షకుండు - ఏతెంచె నేలను న్యాయంబు లోకమందు - స్థాపించి నిత్యము అన్యాయ మంతదాను - పోగొట్ట వచ్చెను
2. వర్షంబు పడునట్లు - శుష్కించు నేలను దుఃఖించు వారికెల్ల - హర్షంబు నిచ్చును శ్రీ యేసు రాజ్యమందు సద్భక్తులందరు ఖర్జూర వృక్షరీతిన్ వర్థిల్లు చుందురు
3. దిగంత వాసులైన - భూరాజులందరు శ్రీ యేసు చరణంబుల్ - నమస్కరింతురు భూలోకవాసులైన - జనంబులందరు క్రీస్తే స్వాధీనమందు జీవింతు రెప్పుడు
4. విరోధులైన వారిన్ - జయింప నెన్నడున్ సింహాసనంబు మీద - నాసీనుడగును అత్యంత ప్రేమమూర్తి - శ్రీ యేసు ప్రభువు ఆ దివ్యనామ కీర్తి - వ్యాపించు నీ భువిన్

Back to Hebron Seeyonu Geethalu