1. యేసు నంగీకరించితి దైవపుత్రుడ నైతిని (2) పరమానందము నిజమైన శాంతియు అధిక జయము నొందితి (2)
పల్లవి:వందన మర్పింతు కృపనొందితితన రాజ్యమందున చేరితిని (2)
2. తండ్రి ప్రేమను పొందితి తనతో నైక్యత కలిగె చేతికుంగరమును కాళ్ళకు జోళ్ళను నూతన వస్త్రమొసగె || వందన ||
3. దోషముల్ క్షమింపబడె నా పాపము కప్పబడె నా ఋణపత్రము మేకులగొట్టి నిర్దోషినిగా తీర్చె || వందన ||
4. పాపపు శిక్ష తొలగెన్ నే నూతన సృష్టినైతిని రాజుగజేసె యాజకునిగను పాడెద హల్లెలూయ || వందన ||
5. ఇహమును నే వదలి పరమ ప్రభుని చేరుదును ఆ దినమునకై ప్రీతితోనేను కనిపెట్టుచున్నాను || వందన ||