CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 155

ప్రభుయేసు నాకై నీ సర్వము నిచ్చితివి

prabhuyesu naakai nee sarvamu nichitivi

Galatians 2:20

More
Reference recording on YouTube ↗
పల్లవి:ప్రభుయేసు నాకై నీ సర్వము నిచ్చితివి (2)ప్రేమనుబట్టి అర్పించు కొంటివి నాకై (2)
1. శిరస్సు నిచ్చితివి ముండ్ల మకుటముకై - స్వామి నా పాపముల కొరకే (2) సహింపజాలని వేదన బహుగా (1) - సహించితివి ప్రేమతోడ (2)
2. కన్నుల నిచ్చితివి కన్నీరు కార్చ - కరుణించి నా స్థితిని జూచి కరిగె నీ హృదయం దుఃఖంబుతోడ - కడు వేదనతో యేడ్చితివి
3. కొరడా దెబ్బలచే నీ దేహమంత - చారలుగ దున్నబడెను శరీరమంత రక్తమయమాయెను - వరదా! గాయము లొందితివా
4. కాళ్ళు చేతులలో మేకులు గొట్టిరి - బల్లెముతో ప్రక్కన్ బొడిచిరి యేలాగు వివరింతు నీ బాధ నేను - ఓర్చితివా మౌనము వహించి
5. ప్రాయశ్చిత్తంబై పోతివా నాకై - పాపము నుండి విడిపించుటకు పొందితి నెంతో గొప్ప రక్షణను - పశ్చాత్తాపము ద్వారా నేను
6. ఎంత అద్భుతము ప్రభువా నీ ప్రేమ - ఎందు కింతగా ప్రేమించితివి వందన మర్పింతు నీ పాదములకే - పొందుగ నీ వాడనైతి
7. నా యెడల నీదు సంకల్పమేగా - నీ స్వాస్థ్య మనుభవించుటకు నీతోడ నిరతం నేనుండునట్లు - నీ యధికారం బిచ్చితివి

Back to Hebron Seeyonu Geethalu