పల్లవి:సన్నుతించెదను ఎల్లప్పుడు (2) - నిత్యము ఆయన కీర్తి నానోటనుండు (2)
1. యోహోవాకు ప్రార్ధించగా - నా భయమంత తొలగించెను (2) శ్రమలన్నిటిలో నాతో నుండి - (2) చేరదీసి నన్ను ఆదరించె - ఆరాధించెద నెల్లప్పుడు (1)
2. జీవితమంతా పాడుచుందును - నీ మేలులకు ఓ ప్రభువా నా ఆయుష్కాల మంతయును నీ విశ్వాస్యత కొరకెప్పుడు - నిరతము నిన్ను స్తోత్రింతు
3. మహోన్నతమైనది నీదు మహిమ - ఘనత ప్రభావముగల ప్రభువా తనివి తీరగ నిను పూజింతు తరగని నీ కార్యములకై - తప్పక నిన్ను స్తుతియింతు
4. నీ సంకల్పమును నెరవేర్చి - నడిపించితివి ఘనముగను నాకు ప్రభుడవై నా కాపరివై నా జీవితములో ఉన్నావు - నిజముగ నిన్ను పొగడెదను