CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 173

అసమానుండగు ఓ క్రీస్తు అద్వితీయుండగు దేవా

asamaanundagu o kreestu adviteeyundagu devaa

Colossians 1:18

More
Reference recording on YouTube ↗
పల్లవి:అసమానుండగు ఓ క్రీస్తు (1)- అద్వితీయుండగు దేవా (1)అల్ఫాయు ఓమేగ (2) - నీవే ప్రభువా (2)
1. ఇహపరములలో నీ జన్మ - మహానందము కలిగించె (2) అభయము నిచ్చి మాకు (1)- భయభీతిని బాపితివి (2)
2. నీ జీవిత వాక్కులన్ని - సజీవము జనులందరికి పావనుడా ప్రభు యేసు - అవనికి మాదిరి నీవే
3. మరణము గెల్చిన మా ప్రభువా - పరమ దేవుడవు నీవే సాతానున్ ఓడించి - నీతిగా మము తీర్చితివి
4. పాపశాపముల బాపితివే - చూపితివే పరమదారి శక్తిగల ఓ ప్రభువా - నీకే మా స్తోత్రములు
5. విశ్వమంతట ఓ దేవా - శాశ్వతమైనది నీ ప్రేమ జ్ఞానమునకు మించినది - ఉన్నతమైన ప్రేమ
6. సంఘమునకు శిరస్సు నీవే - అంగములుగ మము జేసితివి సర్వ సంపూర్ణుండా - సర్వ మహిమ నీకే

Back to Hebron Seeyonu Geethalu