పల్లవి:పిల్లలారా నా మాట వినుడి (1)- యెహోవా యందు భక్తి నేర్పెదను (2)
1. బ్రతుక గోరువాడెవడైన కలడా (2) మేలునొందుచు చాలా దినములు (2)
2. కపటమైన చెడుమాటలాడక - కాచుకొనుము నీదు పెదవులను
3. కీడు మాని మేలునే చేయుము - సమాధానము వెదకి వెంటాడు
4. యెహోవా దృష్టి నీతిమంతులపై - కలదు వారి మొఱల వినును
5. దుష్టుల జ్ఞాపకమున్ భూమినుండి - కొట్టివేయు తన సన్నిధి నుండి
6. నీతిమంతులు మొఱ పెట్టగా - విని శ్రమల నుండి తప్పించును
7. విరిగినట్టి హృదయములకు - యెహోవా ఆసన్నుడై యున్నాడు
8. నలిగియున్న వారల నెల్ల - ఆయనే రక్షించు ప్రేమగల్గి