పల్లవి:నీ మందిరము అతిశృంగారము - నీ ప్రజలందరికిమహిమ తేజస్సు మెండుగ నింపి - నూతన పరచు దేవ (2)
1. నీ రక్తము చిందించి - నూతన జన్మము నిచ్చి - (2) స్వాస్థ్యముగ మమ్ముజేసి - నీ మందిరమున నిలిపి - (2) కొదువలయందు కృపచూపించి - తృప్తిగ పోషించితివి - (2) మహిమ ... మహిమ ... మహిమ ... నీకే - (2)
2. నీ మందిరములో నిత్యము - వసియించి వర్ధిల్లెదము" అనుదినము స్తుతియించి - నూతన బలమును పొంది అన్నిటియందు దీవించబడి - ధన్యులుగా నుండెదము మహిమ ... మహిమ ... మహిమ ... నీకే
3. నీ మందిరములో దొరుకున్ - నిత్యానందము నిరతం శోధన శ్రమల యందు - కదలక స్థిరముగ నిలచు అంతము లేని అద్భుతమైన - ఆదరణ పొందెదము మహిమ ... మహిమ ... మహిమ ... నీకే
4. కోల్పోతిమి నీ మహిమను - మా అతిక్రమముల వలన క్షమియించి నింపుము దేవ - మహాప్రభావ మహిమను మునుపటి మహిమను మించిన మహిమతో - నిండుగ నింపుము దేవ మహిమ ... మహిమ ... మహిమ ... నీకే
5. అంతము వరకు మమ్ము - సజీవ రాళ్ళవలె నుంచి కట్టుము ఆత్మ మందిరము - నింపుము అధిక మహిమను యుగయుగములకు ఘనత మహిమ - నీకు కలుగును గాక మహిమ ... మహిమ ... మహిమ ... నీకే