పల్లవి : ఆనందముతో - ఆరాధింతున్ ఆత్మతోను - సత్యముతోఅనుపల్లవి : రక్షణ పాత్ర నేనెత్తుకొని - స్తుతులు నర్పింతునుహర్షించి పొగడి పూజింతును - యేసుని నామమును
1. పాపినైన నన్ను రక్షింపను - సిలువపై నాకై తానెక్కెనుపరిశుద్ధ జీవం నాకివ్వను - మృత్యుంజయుడై లేచెను|| ఆనందముతో ||
2. మరణపుటురులలో నేనుండగా - నరరూపియై నా కడ కేతెంచెనుపరలోక జీవం నాకివ్వను - మరణపు ముల్లు విరచెను|| ఆనందముతో ||
3. శత్రుని ఉరి నుండి విడిపింపను - శత్రువుతో నాకై పోరాడెనుపదిలంపు జీవం నాకివ్వను - క్రీస్తునందు నను దాచెను|| ఆనందముతో ||
4. పరలోక పౌరసత్వం నా కివ్వను - పరమును వీడి ధరకేతెంచెనుసమృద్ధి జీవం నాకివ్వను - తన ప్రాణమర్పించెను|| ఆనందముతో ||
5. శోధన వేదన బాధలెన్నో - ఈ లోక యాత్రలో ఎదురైననుప్రత్యేక జీవం జీవించను - అర్పించుకొందు నీకు|| ఆనందముతో ||
6. అంగీకరించు - నా జీవితమును - నీ కొరకే ప్రభువాహల్లెలూయ ఆమెన్ - హల్లెలూయ ఆమెన్ - హల్లెలూయ|| ఆనందముతో ||