CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 200

హల్లేలూయ పాడెదా ప్రభు నిన్ను కొనియాడెదన్

hallelooya paadedaa prabhu ninnu koniyaadedan

Psalms 146:2

More
Reference recording on YouTube ↗
పల్లవి:హల్లేలూయ పాడెదా... ప్రభు నిన్ను కొనియాడెదన్ (2)అన్ని వేళలయందున (2)- నిన్ను పూజించి కీర్తింతును (2)ప్రభువా నిన్ను నే కొనియాడెదన్
1. వాగ్ధానముల నిచ్చి - నెరవేర్చువాడవు నీవే (2) నమ్మకమైన దేవా - నన్ను కాపాడువాడవు నీవే (2) ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్
2. నాదు శత్రువులను - పడద్రోయు వాడవు నీవే మహా సామార్థ్యుడవు - నా రక్షణ శృంగము నీవే ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్
3. ఎందరు నిను చూచిరో - వారికి వెలుగు కలిగెన్ ప్రభువా నే వేలుగొందితిన్ - నా జీవంపు జ్యోతివి నీవే ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్
4. భయమును పారద్రోలి - అభయము నిచ్చితివి ఎబినేజరు నీవై ప్రభు - నన్ను సంరక్షించుచుంటివి ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్
5. కష్టములన్నింటిని - ప్రియముగా భరియింతును నీ కొరకే జీవింతును - నా జీవంపు దాతవు నీవే ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్
6. ఈ జీవిత యాత్రలో - ఏమి సంభవించిన మహిమా నీకే ఓ ప్రభూ - ఇదియే నా దీన ప్రార్థనా ప్రభువా - నిన్ను నే కొనియాడెదన్

Back to Hebron Seeyonu Geethalu