పల్లవి:భక్తులారా స్మరియించెదము ప్రభుచేసిన మేలులన్నిటిని (2)అడిగి ఊహించు వాటికన్న మరి (2)- సర్వము చక్కగ జేసె (2)
1. శ్రీ యేసే మన శిరస్సై యుండి, మహాబలశూరుండు (2) సర్వమునిచ్చెను తన హస్తముతో (2) - ఎంతో దయగల వాడు (1)
2. గాలి తుఫానులను గద్దించి,బాధలను తొలగించె శ్రమలలో మనకు తోడైయుండి - బయలు పరచె తన జయమున్
3. జీవ నదిని ప్రవహింపజేసె, సకల స్థలంబులయందు లెక్కకుమించిన ఆత్మలతెచ్చె - ప్రభువే స్తోత్రార్హుండు
4. అపోస్తలుల, ప్రవక్తలను, సువార్తికులను యిచ్చె సంఘము అభివృద్ధిని చెందుటకు - సేవకులందరినిచ్చె
5. మన పక్షమున తానే పోరాడి సైతానును ఓడించె ఇంతవరకును ఆదుకొనెనుగా - తన మహాత్మ్యము జూపె
6. ఈ భువియందు జీవించుకాలము, బ్రతికెదము ప్రభుకొరకే మనమాయన కర్పించుకొనెదము - ఆయన ఆశయమదియే
7. కొంచెము కాలమే మిగిలి యున్నది, ప్రభువును సంధించుటకై గనుక మనము నడచుకొనెదము - ప్రభు మార్గములయందు