పల్లవి:కృపాతిశయముల్ ఓ నా యెహోవా - నిత్యమున్ కీర్తింతును -తరతరములకు నీ విశ్వాస్యతన్ - తెలియ జేసెదను (2)
1. యెహోవా వాక్కు దర్శనమందు - అబ్రామునకు వచ్చెను (2) అబ్రామా భయపడకు (2) నీ కేడెమును - బహుమానము నేనై యున్నాననెను (2)
2. నా నిబంధనన్ ఏ నాటికిన్ - రద్దుపరచనని పల్కెన్ మార్చవు నీ మాటను పెదవులతో పల్కిన దానిని దృఢము చేతువు
3. శాశ్వతమైనదా ప్రభుత్వము - తొలగిపోదే నాటికిన్ లయము కాదు ఆ రాజ్యం మహిమ ఘనత ఆధిపత్యమును నీవాయెన్ నిత్యము
4. నీ నిబంధనన్ దావీదుతోడని లేవీయులతో జేసితివి ఆకాశ తారల వలెన్ సముద్ర ఇసుక రేణువులంతగ జేసెదనంటివి
5. దివారాత్రులతో నా నిబంధన - మార్చెదరా మీరు మీరునట్లు అట్లయిన భంగమగున్ దావీదుతోనే జేసినయట్టి నిబంధనంటివి
6. సింహాసనమున దావీదు - సంతతి యుండక మానదు" లేవీయుల్ యాజకులన్ నా పరిచారకులందరిన్ ఫలింపజేసెదనంటివి
7. యెహోవా నీ కృప కార్యములన్నియు - వీనుల విందుగ నొప్పుచుండె శ్లాఘింతున్ మనసారగన్ హల్లెలూయ - స్తోత్రములతో - కీర్తింతు నిత్యము