పల్లవి:అడవి చెట్ల నడుమ - ఒక జల్దరు వృక్షం వలెపరిశుద్ధుల సమాజములో - యేసు ప్రజ్వలించుచున్నాడు (2)
అను పల్లవి:కీర్తింతున్ నా ప్రభుని - జీవ కాలమెల్ల ప్రభు యేసునికృతజ్ఞతతో స్తుతించెదను (2)
1. షారోను రోజా ఆయనే - లోయ పద్మమును ఆయనే అతి పరిశుద్ధుడు ఆయనే - పదివేలలో అతిశ్రేష్టుడు (2)
2. పరిమళతైలం నీ నామం - దాని వాసన వ్యాపించెగా నిందశ్రమ సంకటములలో - నను సుగంధముగా చేయున్
3. మనోవేదన సహించలేక - సిలువవైపునే చూడగా లేవనెత్తి నన్నెత్తుకొని - భయపడకుమని యంటివి
4. నాత్రోవకు దీపం నీవే - నా బ్రతుకుకు జీవం నీవే నా సేవకు బలము నీవే - నా ఆత్మకాదరణనీవే
5. ఘనమైన నా ప్రభువా - నీ రక్త ప్రభావమున నా హృదయము కడిగితివి - నీకే నా స్తుతి ఘనత
6. నీవు నా దాసుడవనియు - ఏర్పరచుకొంటినని నేనే నీ దేవుడనని - భయపడకు మని యంటివి