పల్లవి:స్తోత్రము స్తోత్యమయ్యా దేవా - స్తోత్రము స్తోత్యమయ్యా (1)
అను పల్లవి:నేత్రమువలె గత వత్సరము (2) - మిత్రుడా బ్రోచితివి - స్తోత్రము స్తోత్యమయ్యా (1)
1. ఎన్నో గొప్ప కీడులు అ..అ.. (2) మాకు పెన్నుగా కలిగినన్" అన్నియు మా చెంత చేరకుండునట్లు (2) - మన్నాధిపా బ్రోచితి..1
2. పేరాశ పాపంబుల - నీవు ధారాళముగ మన్నించి ఈ వత్సరమందు పాపమున పడకుండ - నోవత్సా కాపాడుము
3. ఆనందారంభముతో-నిండు ఆశతో ప్రవేశించి భూమియందు రక్షకుడుగ జన్మించిన - స్వామి నిన్ను కొల్తుము
4. ఈ క్రొత్త యేడునందు - మా అక్కర మేళ్ళన్నియు సతతము మాకు దయతోడ తీర్చుమో - వింత యేసు రక్షకా
5. గద్దియ జీవితము - నీతో ముదముతో సల్పుటకు నిత్యము యేసును ప్రేమతో వెంబడింప - నన్ను కనికరింపుము
6. దేశకీడు తొల్గను - ఇంక దోషములు వీడను హోసన్నా ఏకంబుగా పాడుటకు - దాసుల కరుణింపుము
7. హల్లెలూయా పాటను - నీ ఏట నెక్కువగా పాడన్ దిక్కులవారికి సువార్త ప్రకటింప - గ్రక్కున వరములిమ్ము