పల్లవి:ఓ భక్తులారా మనమందరము - నిత్యము యేసుని స్తుతియించెదము (2)
1. గత కాలమున మన ప్రభుయేసు - నూతన దీవెనలను (2) ఖ్యాతిగానొసగె మనకు (2)- స్తుతియించెదమేసుని (2) నూతన అనుభవములతో - ఖ్యాతిగా సర్వశక్తుని (2)
2. శక్తిమంతుడు మన ప్రభు యేసు - నిత్యమును దీవించును - రక్షించును మనలను తానే - సంపూర్ణముగా కాయున్ సత్యవంతుడు మన ప్రభువు - మాట తప్పని మహారాజు
3. ఎన్ని శోధనలు భువినున్న - తానేమనలను విడిపించును శోధింపబడెను యేసు - తన సహాయము నొసగున్ కనుపాపవలె ప్రభువు కాయున్ - నిత్యము నిలుచు మనతో
4. శక్తిమంతుడు మన ప్రభు యేసు - తొట్రిల్లకుండకాపాడును నిర్జాషులనుగా ప్రభువు - నిలుపును తన మహిమతో తలచుము తన కృపలను - ఎన్నడు విడువడు మనల
5. కృంగిన భక్తులారా మీరు - భంగపర్చు శత్రువుపై జగముపై చాటుడి - జయము - జయము జయమని ప్రభుకే యుగయుగములు మన ప్రభుకే - హల్లెలూయ గీతములతో