పల్లవి:ప్రభు క్రీస్తేసు నీకే మా స్తుతులువిభుడా మాదు స్తుతులే - నీ హారములు
1. నీ దేవుండైనట్టి నేను - నీకు నిత్యం - తోడై యున్నాను నీకేమియు తక్కువకా - దన్న ప్రియుడా
2. మునుపటికంటె - అధికంబైన - మేలును మీకు - కలుగ జేసెదను అని ప్రోత్సాహించిన మా - క్రీస్తు ప్రభువా
3. విస్తార వెండి బంగారం - ఎంతో ఉన్నది - పని ప్రారంభించి మందిరమును కట్టించు - మనిన ప్రభువా
4. నా సంఘమును - నే కట్టెదను - నాతో మీరు - జత పనివారనిన వింతైన మా ప్రధాన - శిల్పి క్రీస్తు
5. పర్వతముల - నెక్కి మీరు - మ్రానులందెచ్చి - నా మందిరమును నిర్మించిన సంతోషింతుననిన
6. సంధ్యారాగ - చంద్రబింబం - సూర్యకాంతి - కళలన్ మెరిసేటి సంఘముగా మమ్ముల రూ-పించెదనన్న
7. ఆ దివ్య భాగ్యమా - కెపుడో - వింతైన నీ - రాకడ నాశించి వేచి యున్నామిలలో - ప్రాణ ప్రియుడా