CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 263

ఈ సుదినము యేసు ప్రభువా నీదు దానం

ee sudinamu yesu prabhuvaa needu daanam

Revelation 21:2

More
Reference recording on YouTube ↗
పల్లవి:ఈ సుదినము - యేసు ప్రభువా - నీదు దానం
1. పరిశుద్ధంబైన - సమాజకూ-టములన్ మాకు ప్రసాదించి - విస్తారమగు - ప్రేమను జూపి - విజయోత్సవమున్ నడుపుచున్న - యేసు ప్రభువా - నీకే మహిమ
2. నూతనంబైన - యెరూషలేము - అను పట్టణము భర్తకొరకు - పెండ్లి కుమార్తె - వలె సిద్ధపడి - దేవుని నుండి వచ్చుట చూచి - సంస్తుతించు - చున్నామిలలో
3. సంపూర్ణంబైన - సిద్ధిని మేము - పొందెదమిలలో స్వచ్ఛంబైన - నీ చిత్తములో - నిలకడ కల్గి - ప్రార్థన యందు పోరాడెదము - నీదు కౄపతో - యేసు ప్రభువా
4. స్వర్ణాలంకృతమై - సూర్యకాంత - పద్మరాగ - రత్నావళితో యేసు ప్రభుని - మహిమతో మెరిసే - పరిశుద్ధ పట్టణముగ మమ్ము - జేసిన ప్రభువా

Back to Hebron Seeyonu Geethalu