పల్లవి:మన దేవుని పట్టణమందాయన - పరిశుద్ధ పర్వతమందు (1)యెహోవా గొప్పవాడును - బహు కీర్తనీయుడై యున్నాడు (2)
1. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన - సీయోను పర్వతము (2) ఉన్నతమై అందముగా సర్వభూమికి సంతోషమిచ్చు చున్నది (2)
2. దాని నగరులలో దేవుడాశ్రయముగా - ప్రత్యక్షంబగుచున్నాడు రాజులేకముగా కూడి ఆశ్చర్యపడి - భ్రమపడి త్వరగా వెళ్ళిరి
3. అచ్చట వారల వణకును ప్రసవించు స్త్రీ - వేదన పట్టెను తూర్పు గాలిని రేపి తర్షీషు ఓడల - పగులగొట్టుచున్నావు
4. సైన్యము లధిపతి యెహోవా దేవుని - పట్టణమునందు మనము వినినట్టి రీతిగా జరుగుట - మనము చూచితిమి
5. మన దేవుడు నిత్యముగా దానిని స్థిర - పరచియున్నాడు దేవా నీ ఆలయ మందున నీ కృప - ను ధ్యానించితిమి
6. దేవా నీ నామము ఎంత గొప్పదో - నీ సత్కీర్తియును భూదిగంతముల వరకు అంత - గొప్పదై యున్నది
7. ఈ దేవుడు సదాకాలము మనకు - దేవుడై యున్నాడు మనల నడిపించును మరణపర్యంతము - హల్లెలూయా - ఆమెన్