CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 29

దేవా నీ కృపచొప్పున నన్ను కరుణింపుము

devaa nee krupachoppuna nannu karunimpumu

Psalms 51:1-9

More
Reference recording on YouTube ↗
1. దేవా నీ కృపచొప్పున - నన్ను కరుణింపుము (2) కృప చొప్పున నా అతిక్రమ - ములను తుడిచివేయుము (2)
పల్లవి:యెహోవా నా దేవా (1)
2. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము
3. నీకు విరోధముగానే - పాపము చేసియున్నాను నీ దృష్టి యెడల చెడు - తనము నే చేసియున్నాను
4. ఆజ్ఞ యిచ్చునపుడు - నీతిమంతుడవుగను తీర్పు తీర్చునపుడు నిర్మలుడవుగ నుందువు
5. పాపములోనే పుట్టిన - వాడను పాపములోనే నాదు తల్లి నన్ను గర్భము ధరియించెను
6. వంతరంగమున - సత్యము కోరుచున్నావు ఆంతర్యములో నాకు జ్ఞనము తెలియజేయుదువు
7. హిస్సోపుతో శుద్ధీకరించు - పవిత్రుడనగుదును హిమము కంటె తెల్లగా నుండునట్లు కడుగుము
8. ఉత్సాహ సంతోషములు - నాకు వినిపింపుము అప్పుడు నీవు విరిచిన - యెముకలు హర్షించును
9. నాదు పాపములకు - విముఖుడవు కమ్ము (2) నాదు దోషములన్నింటిని – తుడిచి వేయుము (2)

Back to Hebron Seeyonu Geethalu