1. పరిశుద్ధులెల్లరు యేసున్ పొగడి - పాడి యార్భటించి పరముననుండ - పరమానంద గీతమచ్చట ధ్వనింప (1) నీ వచట నుందువా? (3) నా మానసమా!
2. గొఱ్ఱెపిల్లయు రాజ్యమేలుచుండ - నాశ్రితు లెల్లరు నాయనను చేర- మిత్రుడెల్ల కన్నీటి దుడుచుచుండ - నీ వచట నుందువా? - నా మానసమా!
3. పేతురు పౌలు యోహాను నచట - పితామహులు యపో స్తలులందరు- హతసాక్షులెల్లరు సమావేశింప - నీ వచట నుందువా?- నా మానసమా!
4. జగములో సిలువను మోసినచో - కిరీటము ధరియించి భాసిల్లుదురు- దేవ పుత్రులుగా నెల్లరు మారగా - నీ వచట నుందువా? నా మానసమా!
5. శోధనల జయించిన వీరులెల్ల - కష్టశ్రమలోర్చిన మహాత్ములు- జ్యోతిర్మయులుగా నొప్పారుచుండ - నీ వచట నుందువా? నా మానసమా!
6. కన్యకరణినాడు ప్రభుసంఘము - రాజు యేసు పెండ్లి కుమారునికి- భార్యగా ప్రకాశింప దాని రుచింప - నీ వచట నుందువా? నా మానసమా! నేనచట నుండెదను - నా యేసుతోడ