పల్లవి:అదిగో వచ్చునదెవరో చూడుమా - మహిమ గలిగిన మన యేసే (1)నీ కన్నులెత్తి చూడుమా - క్రీస్తు ప్రభావముతో వచ్చుచుండెన్ (2)
1. మేఘారూఢుడై వచ్చుచున్నాడు - కంపించెను ఆకాశమెల్ల (2) వీణె వాయింప దూతల్ పాడంగ (2) పెండ్లి కుమారుండై వచ్చుచుండెన్ (2)
2. సూర్యచంద్రులు అదృశ్యులైరి - మృతులెవ్వరులేరు అచ్చట అందరు భయపడి వణకుచున్నారు - తీర్పుచేయ క్రీస్తు వచ్చుచుండెన్
3. గతించును మనమున్న లోకము - నూతన లోక మొకటి కలుగును నూతన మగును జగమంతయును - క్రీస్తు రాజ్యమేల వచ్చుచుండెన్
4. ముండ్ల మకుటము నింకలేదు - మహిమ కిరీటము ధరించెను అలంకారముతో అందమైయున్న - పెండ్లి కుమార్తెకై వచ్చుచుండెన్