పల్లవి:ఇదిగో నేను వచ్చుచున్నాను - త్వరగా వచ్చుచున్నాను (2)ఎవని క్రియల ఫలితము - వానికియ్య వచ్చుచున్నాను (1)
1. మేఘారూఢుడనై నిక్కముగా - తిరిగి వచ్చుచున్నాను (2) ప్రతి నేత్రము వీక్షించును - పరిశుద్ధులై యుండుడి (2)
2. నేను త్వరగా వచ్చుచున్నాను - ఎవడు నీ కిరీటమును అపహరింప కుండునట్లు - జాగ్రత్తగా చూచుకో
3. యేసు ప్రభువే సర్వమును - నూతన పరచుచున్నాడు క్రీస్తుని రాకడను ప్రేమించి - కాయువారే ధన్యులు
4. వేవేగరా మా ప్రభు యేసు - వేచియున్నాను నీ కొరకే నీ దూతలతో వినుతించుచు - హల్లెలూయ పాడెదము