పల్లవి:కాలము సమీపము ప్రభు యేసు వచ్చున్ (2)జీతము పొందును నిజ దాసుడు (2) - ఆనందమొందెదరు (4)
1. బయలుపడు ప్రతివాని క్రియలు - కర్రగడ్డి కొయ్యకాలైనను (2) వెండి బంగారము విలువ రాళ్ళైనను (1) అగ్నియే తెల్పును - (2) అప్పుడే కనుగొందువు (1)
2. పందెమందు నీకు పాలున్నదా - పొందువాడొక్కడే బహుమతిని యోధుడవై మంచి బుద్ధిని కలిగిన వాడబారని - కిరీట మొందెదవు
3. ఆత్మలకొరకై భారమున్నదా - ఫలితమున్నదా నీ సేవలో ప్రభుని రాకలో అందరి యెదుట ఆనందమహిమ - (2) కిరీట మొందెదవు
4. సంఘము నడిపే సేవకుడా - మందను నడుపుము ప్రేమతోడ ఆదర్శుండవై మందను కాచిన మహిమ కిరీటము - నీవు పొందెదవు
5. మంచి పోరాటము పోరాడుము - కాపాడుకొను విశ్వాసమును తన ప్రత్యక్షత నపేక్షించుము నీతి కిరీటము - నీ కివ్వబడును
6. భక్తితో బ్రతుక గోరినచో - సిద్ధపడు పొంద హింసలను అంతము వరకు నమ్మికయుంచిన జీవకిరీటము - పొందెద వెరుగు
7. దయచేయు శ్రేష్ఠ దీవెనలు - అంగీకరించు నీ ప్రార్థనలు ప్రార్థన యందు మేల్కొని యుండుము - స్వర్ణకిరీటము ధరింపజేయును