CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 34

యూదాలో దేవుడు ప్రసిద్ధుడు

yoodaalo devudu prasiddhudu

Psalms 76:1-12

More
Reference recording on YouTube ↗
పల్లవి:యూదాలో దేవుడు ప్రసిద్ధుడు (1)- ఇశ్రాయేలులో తన నామము గొప్పది (2)
అను పల్లవి:షాలేములో తన గుడారమున్నది - సీయోనులో తన ఆలయమున్నది (2)
1. అక్కడ వింటి అగ్ని బాణములను - తాను అక్కడ కేడెముల కత్తులను (1) అక్కడ యుద్ధ ఆయుధములను - తాను అక్కడి వాటిని విరుగగొట్టెను (1) దుష్ట మృగముల - పర్వతముల యందము (2) కన్నను నీవెంతో తేజోమయుడవు
2. కఠినహృదయులు దోచుకొనబడి - వారు గాఢంబుగా నిద్రనొంది యున్నారు పరాక్రమశాలు లందరిని - వారి - బాహు బలమును హరించెను యాకోబు దేవా నీదు గద్దింపునకు రథసారథుల కశ్వములకు నిద్ర కల్గెను
3. నీవు భయంకరుడవు దేవా - నీవు - కోపపడు వేళ నిల్చువాడెవడు? ఆకాశము నుండి తీర్పు వినబడెను - నీవు దేశంబులో శ్రమనొందు వారిని రక్షించి న్యాయపు తీర్చను లేచునాడు భూమి భయమునొంది ఊరకయుండును
4. నరుల కోపము నిన్ను స్తుతించును - వారి ఆగ్రహ శేషమును ధరించుకొందువు మీ దేవుని మ్రొక్కుబళ్ళు చెల్లించుడి - తన చుట్టు కానుకలు అర్పించవలెను అధికారుల గర్వమణచి వేయువాడు భూరాజులకు ఆయన భీకరుడు

Back to Hebron Seeyonu Geethalu