CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 358

రక్షణ నొసగెడు యేసుని ప్రేమను

rakshana nosagedu yesuni premanu

Isaiah 55:6

More
Reference recording on YouTube ↗
పల్లవి:రక్షణ నొసగెడు యేసుని ప్రేమను - లక్ష్యము చేయుము ఓ ప్రియుడా (2)అక్షయ రాజ్యము నీయను వచ్చిన -రక్షకున్ బొగడుము స్నేహితుడా (2)
1. లోకపు ప్రేమను యేమని తెల్పెద -నీ కవమానంబే దలచినచో (2) ఆకలిచెందని రక్షకున్ ప్రేమ - తాకుడు నొందుము ఓ ప్రియుడా (2)
2. పాపపు ప్రేమలో విడువక నిలచిన - తాపము చెందెద వో నరుడా పాపిని గావను ప్రేమ స్వరూపుడు - శాపము నోర్చెను కల్వరిలో
3. చచ్చిన పాపిని వెదకి రక్షింప - చచ్చి బ్రతికిన ఘనుడెవడు వచ్చిన పాపిని వద్దని త్రోయని -నిశ్చల ప్రేమామయుడు యేసే
4. నమ్ముము సోదరా నిన్ను రక్షించును - నెమ్మది నొందెదవు నిజము నమ్మినచో ప్రభుప్రేమను గానవు - నమ్ముము ప్రభు ప్రేమ నీదినమే
5. ఘన ధనికుల మత సౌందర్యంబులన్ - గానవు నిజ ప్రేమాదరణల్ ఎన్నిల నున్నను నిలచునే నిత్యము - పెన్నుగ బొందుము ప్రభు ప్రేమన్
6. తండ్రి కుమార శుద్ధాత్మల చిత్తమున్ - దండిగ నెరవేర్చుచు ఘనులు ఎందరో వేగిరి పొందను మకుటము పొందుము ప్రభు ప్రేమ హల్లెలూయ

Back to Hebron Seeyonu Geethalu