పల్లవి:యేసుని వెంట నేను - వెంబడించుచున్నానునా సిలువను మోయుచు నేను - వెంబడించుచున్నాను
అను పల్లవి:తన హృదయానుసారునిగా - ఉండుటకు సిద్ధపడుచున్నాను || యేసుని ||
1. ఎంతో అద్భుతమైనది - నా ప్రభుని బలియాగం (2) సాదృశ్యముగ నా కొరకై (1) - ప్రాణమర్పించెను (2) నా ప్రభుని తలచుచు నేను - వెంబడించుచున్నాను (2) ||తన ||
2. ఈ లోక సౌందర్యము - నన్ను మోసగించదు సాతాను యుక్తులన్నియు - నా మీద పనిచేయవు యేసుని స్వరము వినుచు - వెంబడించుచున్నాను ||తన ||
3. ఎంతో అద్భుతమైనది - నా ప్రభు నన్ను శిక్షించుట ప్రభు నన్ను సరిచేయుట - తన ప్రేమయై యున్నది యేసుని స్వరము వినుచు - వెంబడించుచున్నాను ||తన ||
4. ఇబ్బందులెన్నో కలిగిన నా దృష్టి ప్రభు మీదనే శ్రమలే మాత్రము కదల్చవు - అద్దరి అగుపడుచున్నది శీఘ్రముగానే చేరుటకు - వెంబడించుచున్నాను ||తన ||
5. తన చిత్తములో నన్నుంచి - నా ప్రభు సంతోషించును మంచి మాటలన్నియు నేర్పి - నను సిద్ధపరచుచున్నాడు మహిమను పొందుటకు నేను - వెంబడించుచున్నాను ||తన ||