1. ప్రభువా తరతరముల నుండి - మాకు నివాసస్థలము నీవే (1) యుగ యుగములకు నీవే మా - దేవుడవు, దేవుడవు, దేవుడవు, దేవుడవు (2)
2. పర్వతములు పుట్టకమునుపు - భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపే నీవు - వున్నావు, వున్నావు, వున్నావు, వున్నావు
3. నరపుత్రుల మంటికి మార్చి - తిరిగి రండని సెలవిచ్చెదవు వేయి సంవత్సరములు నీకు - జామువలె, జామువలె, జామువలె, జామువలె
4. నీదు దుష్టికి వేయి ఏండ్లు - గతించిన నిన్నటి వలె నున్నవి రాత్రి యందొక జాముకు సమముగ - నున్నవి, వున్నవి, వున్నవి, వున్నవి
5. నీవు వారిని పారగొట్టగ - వరద చేతనైన రీతి గడ్డివలె చిగిరించి వాడి - పోయెదరు, పోయెదరు, పోయెదరు, పోయెదరు
6. ప్రొద్దుట మొలిచి చిగిరించును - సాయంతరమున కోయబడును వాడబారును నీ కోపముచే - క్షీణించున్, క్షీణించున్, క్షీణించున్, క్షీణించున్
7. నీదు కోపము వలన మేము - క్షీణించు చున్నాము దేవా నీ యుగ్రతను బట్టి దిగులు - పొందెదము, పొందెదము, పొందెదము, పొందెదము