1. ఓపాపి జీవపు యూటకురా - పాపభారము తోడరా రక్షకుడు నిన్ను పిల్చుచున్నాడు - అక్షయ జీవమీయను
పల్లవి:తామసము చేయకుము - తరుణమును వీడకుముకృపతో నిన్ను రక్షించును - కృపతో రమ్మనెను
2. ఉన్న పాటున రమ్ము యేసు నొద్దకు - పన్నుగ కాచియున్నాడు సింధుర పాపమైనను - బంధరముగ మాయమౌ ||తామ||
3. రక్షకుని వాక్కులన్నియు - రయమున నమ్ముచు పశ్చాత్తాపమొందువారలకు - నిశ్చయ రక్షణ నిచ్చున్ ||తామ||
4. పాపి మనస్సు మారునపుడు - పరమందలి దూతలు సంతోషగాన వితతులచే - వింతగ పాడుదురు ||తామ||
5. వాక్కుల నెరవేర్చిన యేసు - మాట తప్పనివాడు సాకు చెప్పువారల నెల్ల - శిక్షకై నియమించెను ||తామ||"
6. యేసు నంగీకరించువారలను - చేయును శుద్ధులుగా యెల్లరకును మేలుచేసెను - పిల్చుచున్నాడిపుడు ||తామ||
7. హల్లెలూయా పాటపాడెదవు - చల్లని ఆత్మవలన నాథుని నీవు వెదకిన - సాధుగ ఈవుల నిచ్చున్ ||తామ||