పల్లవి:ఓపాపీ - సంధించితివా - నీ పాప - విమోచకుని -నీ పాపముల్ - క్షమించి - నీ ప్రాణమునకు - శాంతినొసగున్ (1)
1. బంధింపబడె - ప్రభువైన యేసు - విడుదల జేయనిన్ను (2) నిందను పొందెను - పొంద నీ వానందము (2)
2. క్రీస్తు యేసు - నీ కొరకేడ్చె - గెత్సెమనే - వనములో వాత్సల్యముతో - నిన్నానందింపజేయ
3. రక్షకుడు తీర్పుకై - నిలిచె - అక్షయ జీవమీయ శిక్షను బొందె - నిన్నానందింపజేయ
4. ప్రభువైన యేసు - తట్టుచున్నాడు - నీ హృదయ ద్వారమున్ అబ్బును శాంతి - తెరచిన హృదయమున్
5. జీవజలమిచ్చు - ప్రభువైన యేసు - దప్పిగొనియున్న నీకు జీవితాంతము వరకు - దప్పిగొన వే మాత్రము
6. రక్షణ దుర్గమున నిన్నుంచి - శత్రువును - అణచివేసి దక్షిణ హస్తముతో - కప్పును - నిన్నెప్పుడు
7. దేవుని స్వరము - వినుడి నేడే - దైవపుత్రులౌదురు సేవించుడి క్రీస్తుని - జీవితములర్పించి