CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 398

చూడుము నీవు మేలుకొనుము

choodumu neevu melukonumu

Matthew 25:6

More
Reference recording on YouTube ↗
పల్లవి:చూడుము నీవు మేలుకొనుము యేసు వచ్చుచున్నాడు (1)అంధకార రాజ్యమున కా రాజు మహిమతో వచ్చును (2)
1. హృదయ ద్వారమును తెరువు (2) - యేసు తట్టుచున్నాడు (1) నేడే నిన్ను పిలుచుచుండె (2)- ఆలస్యము చేయకుము (2)
2. నేడే వినుము సువార్తను - పొందు గొప్పరక్షణ రాదు తరుణము లేదు మరల - మరణము నిన్ను కొనిపోవున్
3. విడువుము అంధకార త్రోవ - విడువుము నీ చెడు జీవితము నేడే యేసును విశ్వసించి - నడువ నాయత్తపడుము
4. పాపడాగులనేకములు - అపాయ మతి నీచములు పాపములేని యేసురక్తము - పాపములన్ని కడుగును
5. కల్వరి సిలువపై చూడుమా - జీవమైన రక్షకుని నీవు పొందుము నిత్యజీవము - లేచి పాడుము హల్లెలూయ

Back to Hebron Seeyonu Geethalu