CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 400

జీవిత మెవ్వరికి, నీ జీవిత మెవ్వరికి?

jeevita mevvariki, nee jeevita mevvariki?

Luke 12:20

More
Reference recording on YouTube ↗
పల్లవి: జీవిత మెవ్వరికి, నీ జీవిత మెవ్వరికి? (1)ఈ లోకములో జీవించు జీవితమంత (1)
1. శరీరేచ్ఛలకై ఆశలుండు (1) - ఈ ధరణియందు (2) సుఖభోగులుగా జీవింతురు (1) - ఈ ధరణియందు (2) వారి యూహలు దినమెల్ల చెడియున్నవి (2) వారి పాప జీవిత మంత శాపమెగ (2)
2. ధనాపేక్షకులెందరో గలరు - ఈ ధరణియందు ధనముపై మనస్సు నిల్పెదరు - ఈ ధరణియందు వారి కలవరమంత ధనము ధనమే వారు బ్రతికెడు బ్రతుకంత క్షీణతయే
3. స్వంత బోధలకై బ్రతికెదరు - ఈ ధరణియందు గర్వమునకు అమ్మబడి యుందురు - ఈ ధరణియందు వారి మనసులు సంకుచితములై యుండు వారి జీవిత ప్రయాసము - పతనమేగా
4. విరిగిన హృదయులు కలరెందరో - ఈ ధరణియందు కరిగెడు ఉప్పుగ నుండెదరు - ఈ ధరణియందు వారు ప్రభుకై దాగియే నిలచెదరు దైవ వాక్కుగ దినమెల్ల సేవింతురు

Back to Hebron Seeyonu Geethalu