పల్లవి:తెరువు నీ హృదయ ద్వారంబు నేడే - ప్రభుయేసునందే రక్షణ కలదు (2)నిర్లక్ష్యముగా జీవించనేల (2) - వేచియున్నది తీర్పు నీ కొరకై (1)పరమున కేగుట కాయత్తపడుము - తెరువు నీ హృదయంబును (1)
1. జన్మంబుతోనే పాపివి నీవు - నీతిమంతుడే లేడు (2) కామ, క్రోధ, లోభ, మోహ, - పాపపు డాగులివియే (2)
2. ధర్మకర్మల వస్త్రంబు నీవు - కప్పుకొన్న దాగవునీ పాపము కడిగి నీతిగా తీర్చే - ఔషధంబేమి లేదు
3. తెలియదు నీకు నీ మరణ దినము - నిశ్చింతగా నుండెదవా పాప ఫలితము నరకమే వినుము - విడిపించెడి వారెవ్వరు?
4. పాపమువలన నీ జీవితమును - నష్టపరచుకొందువా? భరింపలేని నరక బాధ - ఏడ్పేగా నీ ఫలితము
5. పాపపు శిక్ష నీదై యుండ - నిన్ను రక్షింపనెంచె సిలువ శ్రమలు భరించెనేసు - నీకై రక్తము కార్చెగా
6. ఒప్పుకొనుము నీ పాపములను - అపరాధినంచు వేడు తన రక్తమందు కడుగును నిన్ను - రక్షణ నొందెదవు