పల్లవి:విడువవు నన్నిక ఎన్నడైనను - పడిపోకుండా కాయురక్షకా (2)పడిపోవు వారెల్లరిని - లేపెడి వాడవు నీవే ప్రభూ (2)
1. ప్రభువా నీకవిధేయుడనై - పలుమారులు పడుసమయములో (2) ప్రేమతో జాలి దీనస్వరముతో - ప్రియుడా నను పైకెత్తితివి (2)
2. ఆదాము హవ్వలు ఏదేనులో ఆశతో ఆజ్ఞమీరినను సిలువకు ఛాయగ బలి నర్పించి - ప్రియముగా విమోచించితివి
3. మోషేకు నీ దర్శనమిచ్చి - నీ ప్రజలను నడిపించుటకై సాకులు చెప్పిన విడువక తననే - నాయకునిగ నియమించితివి
4. స్వంత తలంపున దావీదు - మందసమును తెచ్చునప్పుడు ఉజ్జా మరణముచే దావీదు - హృదయమును కదిలించితివి
5. నీ మాటలు వినక యోనా - తర్షీషుకు తరలినపుడు సముద్రములో మునుగుచుండగ - చేపద్వారా దరిచేర్చితివి
6. నిన్నెన్నడు యెడబాయనని - నిక్కముగ పేతురు పలికె ముమ్మారు బొంకినను విడువక - ప్రేమతోను రక్షించితివి
7. మా శక్తియు మా భక్తియు కాదు - ఇలలో జీవించుట ప్రభువా కొల్లగ నీ యాత్మను నొసగితివి - హల్లెలూయ పాడెదను