పల్లవి:సీయోను పురమా - సర్వోన్నతుని (1) శృంగారపురమా - సీయోనుపురమా (2)
అను పల్లవి:శాశ్వతముగ దైవ - సంకల్పంబైతివి (2)స్వర్ణాలంకార సీయోను - సతతము నీదే యనుభవ భాగ్యము (1)
1. షాలేము రాజు సంతోషముగా - సంధించెను నిన్ను (2) - షాలేమురాజు (1) అర్పించెను నీలో - అబ్రాహాం కొమరుని (2) స్వర్ణాలంకార సీయోను - దావీదు పట్టణమనబడెడు (1)
2. ఉత్తర దిక్కున - ఎత్తయిన -శృంగార నగరమా - ఉత్తర దిక్కున సర్వభూమికి - సంతసమిడుచున్నావు స్వర్ణాలంకార సీయోను - రమ్యముగా రంజిల్లు నగరమా
3. నీ నగరులయందు - నివసించుచున్నాడు - నీ ప్రభువు - నీ నగరులయందు రాజులు కూడిరి - నీ తేజము జూచిరి స్వర్ణాలంకార సీయోను - రమ్యముగా రంజిల్లు నగరమా
4. నిత్యుండగు తండ్రి - నీ నిర్మాణకుడు - శిల్పియు తానె - నిత్యుండగు తండ్రి ప్రభుయేసే నిన్ను - పరిణయమాడను కోరెన్ స్వర్ణాలంకార సీయోను - వైవాహికానందము నీదే
5. రక్షణ వార్తలు - రమ్యముగా - నీలో వినబడుచున్నవి - రక్షణ వార్తలు జనులెల్ల నీలో - జన్మించెనందురు స్వర్ణాలంకార సీయోను - జనముల తల్లియని నిన్నందురు
6. నిండియున్నవి - నీలో దైవోద్దేశము - లెన్నెన్నో - నిండియున్నవి ఘన కార్యము లెన్నో - గొప్పగ జరిగెను నీలో స్వర్ణాలంకార సీయోను - విభవమును వివరింపగ లేము
7. సొంపుగ పాడుడి - సంతసముగ - సీయోను పాటలను - సొంపుగ పాడుడి యేసునకే మహిమ - భాసురముగ చెల్లించి స్వర్ణాలంకార సీయోను - హల్లెలూయా - యేసుప్రభునకే