1. యెహోవా మీద - క్రొత్త కీర్తన పాడుడి (2) సర్వ భూజనులారా - పాడుడి మీరు (2)
పల్లవి:యెహోవాకు పాడుడి (1)
2. యెహోవాకు పాడి - నామమును స్తుతించుడి అనుదినము రక్షణ సువార్తను ప్రకటించుడి
3. అతి మహాత్మ్యము గల - వాడు యెహోవా అధికస్తోత్రము నొంద - తగినవాడు ఆయనే
4. సమస్త దేవతలకన్న - పూజనీయుడు అన్య జనులలో తన మహిమను ప్రకటించుడి
5. సకల జనములలో - నాయన ఆశ్చర్య కార్యముల ప్రచురించి పూజింప రండి
6. జనముల దేవత - లందరు విగ్రహములే యెహోవా నాకాశ విశా-లములను సృజించె
7. ఘనతాప్రభావము - లాయన సన్నిధి నున్నవి బల సౌందర్యము లాయన పరిశుద్ధ స్థలమందున్నవి