పల్లవి:గొఱ్ఱెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చెను రండి (2)
1. సర్వాధి కారియు - సర్వోన్నతుండైన (2) మన తండ్రిని ఘనపరచి - మన ముత్సహించెదము (2)
2. సిద్ధపడెను వధువు - సుప్రకాశము గల నిర్మల వస్త్రములతో - నలంకరించు కొనెన్
3. పరిశుద్ధుల నీతి - క్రియలే యా వస్త్రములు గొఱ్ఱె పిల్ల రక్తములో శుద్ధి నొందిన వారు
4. తెల్లని గుర్రముపై కూర్చుండినవాడు నమ్మకమై యున్నట్టి - పెండ్లి కుమారుడు
5. దేవుని వాక్యమను - నామము గలవాడు రక్తములో ముంచిన - వస్త్రమున్ ధరియించె
6. ప్రేమించి సంఘముకై - ప్రాణంబునిడె ప్రభువుపరిశుద్ధ పరచుట కొరకై - తానప్పగించుకొనెన్
7. శ్రీ యేసు క్రీస్తుండే - సంఘంబునకు శిరస్సు వాక్య ఉదకముతోడ - శుద్ధిపరచుచుండె