పల్లవి:ప్రభు దయచేయు - నిత్య దీవెనలు బెరాకాలో చూతురు (2)
1. కీడు, యుద్ధము, తెగులు, కరువైనను - దాడి చేయబూని విజృంభించి నపుడు (2) నీవు మొరపెట్టిన నీకు దొరుకు - నిజముగా - రక్షణ (2)
2. శత్రు శోధనలు పై బడినప్పుడు - శక్తిహీనులమై పోయినప్పుడు క్రీస్తు దయచేయు నిత్యాదరణ - నిజముగా - చూతురు
3. ప్రభు యుద్ధము చేయు నాయకుడు - ప్రభు పక్షమందు చేరుము యీనాడే నీవు పొందెదవు బెరాకాలో - నిజముగా - జయము
4. పలువిధ శ్రమలందు చేరుమా - ప్రీతిమీర మిమ్ము దరిచేర్చును నీతియుక్తముగా స్తుతించుము - ఖ్యాతితో ప్రభుని
5. నిత్యదేవుని మహాకృప నిరతం - శత్రువును జయించును నిశ్చయం కృతజ్ఞతా స్తుతులు మీరు - నిత్యముగా చెల్లించుడి
6. స్వరమండల సితారా వాయించుడి - శత్రువులతో ప్రభు పోరుసల్పెను బెరాకాలో ప్రభు స్వరమెత్తి - మరి మరి - పాడుడి
7. పరమ తండ్రి ప్రసాదించు నెమ్మది - భూరాజులు గడగడ వణికిరి తన ప్రజలను సంతోషపరచును - హల్లెలూయ - పాడుడి