పల్లవి:దేవుడొక నగరము మన కొరకై - సిద్ధపరచుచుండె నుండుటకై (2)మనము వెళ్ళెదం నిశ్చయముగా (1)
1. మేలిమి బంగారము అద్భుత నగరం - విలువైన రాళ్ళతో పునాది వేసెను (2) రక్తముచే శుద్ధులై క్షమించబడితిమి (2) మనము వెళ్ళెదం నిశ్చయముగా నిశ్చయముగా (2)
2. నగర ప్రాకారములు ఎత్తైనవి - సూర్య కాంతములచే కట్టబడెను ప్రభువే విమోచించి అధికారమిచ్చెను మనము వెళ్ళెదం నిశ్చయముగా నిశ్చయముగా
3. ముత్యాల గుమ్మములు పండ్రెండు గలవు - పన్నిద్దరు దూతలు అచ్చట నుండిరి పరిశుద్ధ జీవితం నేర్పించెను ప్రభువు మనము వెళ్ళెదం నిశ్చయముగా నిశ్చయముగా
4. ఆ నగర వీధులు మేలిమి బంగారం - ద్వారములు ఎప్పటికి మూయబడవు ఆర్భాటంతో ప్రవేశించి విజయోత్సవంబుతో మనము వెళ్ళెదం నిశ్చయముగా నిశ్చయముగా
5. గొర్రెపిల్ల సింహాసన మచ్చటుండును - ఆయనే దీపము నాలయమై యుండును జీవగ్రంథమందున పేరులున్నవనుచు మనము వెళ్ళెదం నిశ్చయముగా నిశ్చయముగా
6. జయవంతుల కొరకే ఆ నగరం - పాపాత్ములు అచ్చటకు వెళ్ళనేరరు విజయుల మౌదము క్రీస్తుని రక్తముచే మనము వెళ్ళెదం నిశ్చయముగా నిశ్చయముగా