CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 48

స్తుతియించు ప్రభున్ స్తుతియించు నీవు

stutiyinchu prabhun stutiyinchu neevu

Psalms 103:1-22

More
Reference recording on YouTube ↗
పల్లవి:స్తుతియించు ప్రభున్ స్తుతియించు -నీవుస్తుతియించు - ప్రభున్ స్తుతియించు (1) నా ప్రాణమా - నా సమస్తమా (2)
1. ఆయన చేసిన ఉపకారములలో (2) నా ప్రాణమా నీవు మరువకుమా (1)- దేనిన్ - నా ప్రాణమా నీవు మరువకుమా (1) నీ దేవుని నీవు మరువకుమా (2)
2. నీ దోషములను మన్నించి వేసి నీ రోగముల నన్నింటిని - ప్రభు - నీ రోగముల నన్నింటిని కుదుర్చి వేయుచున్నాడు
3. నా ప్రాణమును సమాధి నుండి విమోచించిన వాడని - ప్రభు - విమోచించిన వాడని కరుణా కిరీటము నియ్యన్
4. పక్షిరాజు యౌవనము వలె నూతన యౌవన ముండునట్లు - నీకు - నూతన యౌవన ముండునట్లు మేలుతో తృప్తిపరచును
5. దీర్ఘశాంతుడు దయగల దేవుడు యెల్లప్పుడు వ్యాజ్యమాడడు - నీతో - ఎల్లప్పుడు వ్యాజ్యమాడడు ప్రతీకారము చేయడు
6. భూమికంటె ఎంత ఆకాశమెత్తో భక్తుల యెడల కృపనంత - తన - భక్తుల యెడల కృపనంత అధికముగా చేసియున్నాడు
7. పడమటికి తూర్పెంత యెడమో పాపములకును మనకంత - మన - పాపములకును మనకంత యెడము గలుగ జేసెను
8. తండ్రి తన కుమారుని యెడల జాలిపడునట్లు యెహోవా - బహు - జాలిపడునట్లు యెహోవా భక్తులపై జాలిపడును
9. మంటివాడవని ఆయన యెరుగున్ నిర్మింపబడిన విధమెరుగున్ - నీవు - నిర్మింపబడిన విధమెరుగున్ నీ దేవుడు నిన్ను నెరుగును
10. దేవదూతలారా దైవభక్తులారా యెహోవా మహాసైన్యములారా - ఓ - యెహోవా మహాసైన్యములారా హల్లెలూయ పాట పాడుడి

Back to Hebron Seeyonu Geethalu