CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 489

ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను

idigo nenoka nootana kriyanu cheyuchunnaanu

Isaiah 43:19

More
Reference recording on YouTube ↗
పల్లవి:ఇదిగో నేనొక నూతన క్రియను చేయుచున్నాను (2)
అను పల్లవి:ఈనాడే అది మొలచును దాని నాలోచింపరా (2) ||ఇదిగో||
1. అడవిలో త్రోవనుజేసి - ఎడారిలో నదులను నేను (2) ఎల్లప్పుడు సమృద్ధిగా - ప్రవహింప జేసెదను (2)
2. నాదు ప్రజలు త్రాగుటకు - నేనరణ్యములో నదులు సమృద్ధిగా పారునట్లు - సృష్టించెదను నేను
3. అరణ్యములో జంతువులు - క్రూరపక్షులు సర్పములు ఘనపరచును స్తుతియించును - దీని నాలోచించుడి
4. నూతన సృష్టిగ నినుజేసి - నీ శాంతిని నదివలెజేసి ననుజూచి మహిమపరచి - స్తుతిబాడ జేసెదను
5. నేనే దేవుడనని దెలసి - నా కార్యములను నెరవేర్చి ముందున్న వాటికన్న - ఘనకార్యములను జేతున్
6. మరుగైన మన్నానిచ్చి - మరితెల్లని రాతినిచ్చి చెక్కెదనా రాతిమీద - నొక క్రొత్త నామమును
7. పరలోక భాగ్యంబులు - నరలోకములో మనకొసగెన్ కరుణాసంపన్నుడగు - మన ప్రభువునకు హల్లెలూయ

Back to Hebron Seeyonu Geethalu