CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 493

ఎల్లప్పుడు ఎల్లప్పుడు ఎల్లప్పుడు సంతోషము

ellappudu ellappudu ellappudu santoshamu

1 Thes 5:16

More
Reference recording on YouTube ↗
పల్లవి:ఎల్లప్పుడు ఎల్లప్పుడు ఎల్లప్పుడు సంతోషము - యేసు నాతోకూడ నున్నందున (2)
1. ఎల్లను పెంటతోడ తుల్యము - నరు - లెల్లరును మన్నై పోవుదురు (1) రంగుగ ప్రియ యేసు మిత్రుడు నాకుండ - మంగళముగ నుందు కొదువలేదు (1)
2. తల్లి దండ్రులాప్తుల్ మరణమైన - నింక - నెల్ల స్నేహియులు గతించినన్ రాజుయేసుక్రీస్తు ప్రకాశమిత్రుడు కొదువలేదు నాకు దిగులు లేదు
3. కావలివాడు నిద్రపోడు కున్కడు - ఆశ ప్రేమ కలిగినవాడు పదివేలు కత్తివాతన్ ప్రక్క కూలిన దిగులొందను నేను భయమొందను
4. ఇహలోహ సత్రంబు నందున్నను - స్వర్గ - గృహము పైన నాకు నిత్యముండున్ అచ్చట శాశ్వతంబుగ నుందుగాన నా కిచ్చట సతతమని ఎటులందును
5. ఈ నరులు నన్ను బహుతిట్టి దూషించిన -నా పేరు చెరుప ప్రయత్నించిన బదులు చెప్పను నా నాలుక నెత్తను యేసు వలె వారి కరుణింతును
6. ఎట్టి శ్రమలు కష్టనష్టములున్న - దుష్ట సైతానుడు ఎదిరించిన భయపడను నా కపాయము కలుగదు నా యేసు నాకు జయవీరుడు
7. ఆదరించు వారలాప్తులెల్లరు - ఈ భూతలమును వీడిపోయినను పరమ ఆదరణ కర్త యేసు వెంట ప్రేరేపితుడనై ఏగుదు నెల్లడన్
8. నా మిత్రుని చేయిబట్టి - నే నిల్తును - నా శత్రుని జయింతు - ప్రభు శక్తిచే వాక్య ఖడ్గంబును - విల్లును ధరియించి విజయంబు నొందెద - వీరునిగా

Back to Hebron Seeyonu Geethalu