పల్లవి:ప్రేమా ప్రేమా - ప్రేమా ప్రియుడవు నీవే (1)- ఆనంద మానందమే (2)
1. నీ ప్రేమ రుచియించిననాడే - నన్ను నేను మరచితినయ్యా (2) నీ ప్రేమధికమయ్యా - నా పై - నీ ప్రేమధికమయ్యా (2)
2. పరలోక ప్రశస్తరాజా - ప్రేమతో నేతెంచినావా ప్రేమ తెలియగలనా - నీ ప్రేమ - లోతునెరుగగలనా?
3. ద్రోహినై ఎన్నాళ్ళో నిన్ను - గాంచక తిరిగితినయ్యా ప్రేమతో నా ప్రియుడా - నన్ను - కౌగిలించితివే
4. ఇహలోక సకల మహిమ - పువ్వులవలె వాడిపోవున్ వాడదే అయ్యా - నీ ప్రేమ - వాడిపోదయ్యా
5. నీ ప్రేమ మాధుర్యమును - వివరింప తరమౌనే నాకు అతి సులభముగానే - పరమున - వివరించగలను