పల్లవి:దేవా నా హృదయము - నీయందు స్థిరమాయెన్ (1)నే పాడుచు స్తుతింతున్ - నా యాత్మ గానము చేయున్ (2)
1. స్వరమండలమా సితారా - మేల్కొనుడి మీరు కూడా - మేల్కొనుడి మీరు కూడా (2) వేకువనే నే లేచెదను (2) - స్తుతిగానము చేసెదను (4)
2. దేవా నీ జనముల మధ్య - కృతజ్ఞతా స్తుతులను - కృతజ్ఞతా స్తుతులను చెల్లించి ప్రజలలోన - స్తుతిగానము చేసెదను
3. ఆకాశమున కంటె నీ - కృప మహోన్నతమైనది - కృప మహోన్నతమైనది నీదు సత్యము మేఘములకంటె - అత్యున్నతమైనది
4. దేవా నీ వాకాశముకంటె - మహోన్నతుడవు కమ్ము - మహోన్నతుడవు కమ్ము నీదు మహిమ సర్వభూమి - మీద వ్యాపించును గాక