CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 502

బలవంతుడేసు మహిమ - పాడి వీలగునే వివరింప

balavantudesu mahima - paadi veelagune vivarimpa

Isaiah 12:3

More
Reference recording on YouTube ↗
1. బలవంతుడేసు మహిమ - పాడి వీలగునే వివరింప (1) కల్వరి రక్షణవిలువ ఎల్లరికిని దొరుకును (1)
పల్లవి:హా! రక్షణంపు బావులెల్లను అంతులేని లోతుగలవి (1)ఎండిపోవు ఎన్నడైనను చేదికొందు మెన్నడందున (2)
2. నీళ్ళు లేని శ్రమ యెంతయో - దీని నాలోచించరే యెవ్వరు విలువైన ప్రభుని మాటలను ఆలకించి యంగీకరించు || హా! ||
3. ఉప్పునీళ్ళ బావులున్నను ఇక ఉపయోగము యుండదు తప్పులన్ని త్రోసివేయుము అప్పుడే యానందమబ్బును || హా! ||
4. కలహముల మానివేతుము మంచి - జలముల త్రాగి యానందింతుం ఎల్లర మేకమౌదము తొలగద్రోసి యడ్డులన్నియు || హా! ||
5. జీవజలముల త్రాగినవారు - మీరు దేవుని సాక్షులై యుండుడి భువి నెందరో దప్పిగొన్నారు త్రోవ జూపుడి వారికి || హా! ||

Back to Hebron Seeyonu Geethalu