పల్లవి:సమాధాన - గృ - హంబులోను సమాధానకర్త స్తోత్రములు (2)
1. క్రీస్తు యేసు మనకిలలో - నిత్య - సమా - ధానము (2) మధ్యపు గోడను - కూలద్రోసెను (2) నిత్యశాంతిని మనకొసగెన్ (2)
2. నదివలె - సమాధానం - వడిగా ప్రవహించు చున్నది అడ్డుల ద్రోసి - మధ్యను నిలిచె శ్రద్ధతో - మధ్యకు చేర్చెన్
3. లోకమిచ్చు - నట్లుగా - కాదు ప్రభు సమాధానము సత్యమైనది నిత్యము నిల్చును నిత్యు డేసుచే కల్గెన్
4. దేవుని - రాజ్యమిల - కాదు - భోజనపానముల్ నీతియు - సమాధానము నిల పరిశుద్ధాత్మలో ఆనందం
5. పర్వతములు - తొలగినను తత్తరిల్లిన - కొండలు నాదు - కృప నిన్ను - విడువదనెను నా సమాధానము - ప్రభువే
6. ఆశ్చర్య - కరుడు యేసే ఆలోచన - కర్తయు బలవంతుడేసు - సమాధాన ప్రభు బలపరచు - తన ప్రజలను