పల్లవి:భయపడకుము ఓ చిన్న మందా - దయగల మీ తండ్రి పిలుచుచున్నాడు (2)
1. తన రాజ్యమంత నీ కీయగోరి (2) - ఉన్నత పిలుపు నీకు నిచ్చెను (2) తనరక్తమిచ్చి నిన్ను కొన్నాడు (2)
2. దేవుని రాజ్య మహిమను బొంద - సువార్త ద్వారా నిన్ను పిలిచెను నీవు నడువుము తగినట్లు ప్రభుకు
3. పరిశుద్ధులలో పాత్రునిచేయ - పరలోక పిలుపు నీకు నిచ్చెను ప్రభుని స్వాస్థ్యమును నీ కిచ్చున్
4. అక్షయ నిర్మల వాడబారని - రక్షణ స్వాస్థ్యము భద్రపరచి నిశ్చయముగా నిన్ను పిలిచెను
5. తన కుమారుని నీ కొరకీయ - వెనుదీయలేదు నీ ప్రియతండ్రి తన స్వాస్థ్యమంత నీ కొర కిచ్చున్
6. ప్రైశుద్ధాత్మలో నిను శుద్ధిజేసి - పరిశుద్ధుల స్వాస్థ్యము నీ కీయ తెరువ జేసెను నీ కన్నులను
7. సిలువలో యేసు చనిపోయి బ్రతికె - గెలిచె - సమాధి బలమీయ నీకు హల్లెలూయ యని పాడుము నీవు