CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 525

నా ప్రేమరాజు కాపరి నన్నెంతో ప్రేమించును

naa premaraaju kaapari nannento preminchunu

Psalms 23:1

More
Reference recording on YouTube ↗
1. నా ప్రేమరాజు కాపరి - నన్నెంతో ప్రేమించును ఈ రాజు వాడనైనచో - నా కెట్టి లేమిలేదు
2. పోషించి నాదు నాత్మకు - జీవంపు నీటినిచ్చున్ పోషించు దాని నిత్యమున్ - జీవాహారంబుతోను
3. నే త్రప్పుత్రోవనుండగా - రక్షింప వెదకె నన్ను మోదంబుతో కనుగొనెన్ - నన్ మందలోన జేర్చెన్
4. పాతాళం యొక్క చీకటి - నన్ భీతిపర్చబోదు నా దాపునుండ క్రీస్తేసు - నా ముందు నిల్చున్ సిల్వ
5. నా దృష్టిలో నాహారము - సిద్ధంబు జేతు వీవు నీ శుద్ధ ప్రేమానందముల్ - పారెన్ రక్షింప నన్ను
6. నీ మంచి నైజంబో ప్రభూ - నిరంతరంబు నిల్చున్ స్తోత్రింతు నిన్ను నీయింటన్ - ఓ కాపరి నా యేసు

Back to Hebron Seeyonu Geethalu