CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 538

నిశ్చయముగ నిన్ను దీవించెదను

nishchayamuga ninnu deevinchedanu

Genesis 12:2-3 ;17:2-6

More
Reference recording on YouTube ↗
పల్లవి:నిశ్చయముగ నిన్ను దీవించెదను (2)నిశ్చయముగ నిన్ను వృద్ధి పొందింతున్ (2)నిశ్చయముగ నిన్ను వృద్ధి పొందింతున్ (2)
1. ప్రత్యక్షమై పలికెనుగ ప్రభువు - సర్వశక్తిగల యెహోవాను నేను (2) నా సన్నిధిన్ నిర్దోషిగా నడచిన (2) - నీతో నిబంధన నియమింతును (2)
2. నీ సంతానమును దీవించి - నిన్ను ఫలియింప జేసెదను నీలో నుండి జనములు వచ్చును - నీతో నిబంధన స్థిరపరతున్
3. యుగయుగములు నీకు దేవుడను - కనాను దేశము నీకొసగెదను నిత్యస్వాస్థ్యమును నీ కొసగెదను - నీలో మహిమ నే పొందెదను
4. గొప్ప జనముగా జేసెదనిన్ను - నిశ్చయముగా ఆశీర్వదింతున్ నీనామమును గొప్ప జేసెదను - ఆశీర్వాదముగ జేసెదను
5. నిన్నాశీర్వదించువారిని - నేను ఆశీర్వదించెదను దూషించువారిని నే శపించెదను - నీ ద్వారా దీవింపబడెదరు

Back to Hebron Seeyonu Geethalu